09-02-2026 02:15:08 AM
చేవెళ్ల మున్సిపల్ 15వ అభ్యర్థి బండారి శైలజ ఆగిరెడ్డి
చేవెళ్ల, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల 15వ వార్డు అభ్యర్థి బండారు శైలజ ఆగిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను వారు ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఓటర్లు ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ తమ గెలుపును బలపరుస్తున్నారు.
ఓటు కాంగ్రెస్ హస్తం గుర్తుకు వేసి గెలిపిస్తామని శైలజా కు మద్దతు పలుకుతున్నారు. తన భర్త చేవెళ్ల సర్పంచ్ గా గ్రామ ప్రజలకు చేసిన సేవలు ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. మౌలిక వసతులు 90 శాతం పూర్తి చేశామని ప్రజలు మెచ్చేలా చేవెళ్ల మున్సిపాలిటీని తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు.
సర్పంచ్‌గా గెలిచిన తొలి ఏడాదిలోనే
సర్పంచ్గా పనిచేసిన తొలి సంవత్సరంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సరఫరా, పారిశుధ్య వంటి ముఖ్యమైన పనులను చేపట్టినట్లు శైలజ ఆగిరెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో 90 శాతం డ్రైనేజ్, రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి చేవెళ్ల రూపురేఖలు మార్చినట్లు స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని, సేవ చేయడమే తనకు ముఖ్యమని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ప్రకారం ఆరు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని ఆమె వివరించారు. పేదలకు సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల ఆరోగ్య భీమా, రూ.500కు గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా, రైతు బీమా పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఇవన్నీ ప్రజలకు చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
15 కోట్లతో పనులు షురూ
హెచ్‌ఎండిఏ నిధులు రూ.15 కోట్లతో చేవెళ్లలో ఇప్పటికే పనులు ప్రారంభమైనట్టు గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ పట్ల ప్రజలకు ఉన్న ఆశలను నెరవేర్చే దిశగా పనిచేస్తానని తెలిపారు. చేవెళ్లను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని నమ్మకంగా చెప్పారు. మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు శైలజ ఆగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 15వ వార్డు తరఫున తమను గెలిపిస్తే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు.