09-02-2026 02:07:33 AM
అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్
ఎల్బీనగర్, ఫిబ్రవరి 8 : దేశంలో అత్యధిక వెనుకబడిన కులాల్లో వడ్డెరులు ఉన్నారని, వడ్డెరులకు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు టికెట్ల ఇవ్వాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కర్మన్ ఘాట్ లోని ఆలంపల్లి కాంప్లెక్స్ లో ఆదివారం అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వడ్డెరలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారన్నారు.
చాలా సంవత్సరాలుగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందక తీవ్ర దుర్భర పరిస్థితులలో జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డెర కులస్తుల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే వడ్డెరలు సుమారు 30 లక్షలకు పైగా ఉన్నారని, వారు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు.
ఇప్పటికైన జనాభా దామాషా ప్రకారం వడ్డెర కులస్తులకు వివిధ రాజకీయ పార్టీలు తమకు మకు సీట్లు కేటాయించాలని కోరారు. వడ్డెరులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని, అందులో భాగంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 25 సీట్లు కేటాయించాలని, నామినేటెడ్ పోస్టులలో వడ్డెరలకు ప్రాధాన్యత కల్పించడంతోపాటు ప్రభుత్వసంక్షేమ పథకాలలో వడ్డెరలకు సముచిత న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
వడ్డెర వృత్తి దారులు క్రషర్, బ్లాసిల్టింగ్ సమయాలలో చాలామంది కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారని, అలాంటి వారికి రూ, 20 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. క్రషర్ వాటాలో భాగంగా వడ్డెరలకు 40శాతం కేటాయించాలని, గాయపడిన వారికి ఉచితంగా అన్ని కార్పొరేటర్ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో 40శాతం తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని పార్టీలు వడ్డెరులకు సీట్లు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుంజ వెంకటనారాయణ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డేరంగుల కృష్ణ, వడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంజల రమేష్, జాతీయ కార్యదర్శి క్రింజా శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నారాయణ, తెలంగాణ రాష్ట్ర మలీల అధ్యక్షుడు కుంచపు రాము, తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షురాలు సతోల గోపాల్ పాల్గొన్నారు.