calender_icon.png 21 July, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ నమ్మకం వమ్ము చేయను

21-07-2025 01:30:28 AM

  1. ప్రతి ఒక్కరి బాగు కోసం పనిచేస్తున్నాను 

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

మూసాపేట జూలై 20 : ఏ నమ్మకంతో అయితే ఇతర పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో ఆ నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చెయ్యన్నని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామానికి చెందిన నిజలపూర్ మాజీ సర్పంచ్ బీసన్న, బిఆర్‌ఎస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, గాజుబండ శేఖర్, నవీన్, వెంకట్, సిరిపురం ఆంజనేయులు తో పాటు 31 మంది బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారని పేర్కొన్నారు. ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందా ముందుకు సాగుదామని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో మూసాపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్, నిజాల పురం గ్రామ అధ్యక్షులు రామచందర్, మాజీ సర్పంచ్ గోవర్ధన్, సిజి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.