calender_icon.png 21 July, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతబస్తీకి హిందువులంతా తిరిగిరావాలి

21-07-2025 01:31:51 AM

- రక్షించే బాధ్యత మేం తీసుకుంటాం 

- హిందూ పండుగలకు నిధులు అడుక్కోవాలా?

- కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): పన్నులు, బిల్లులు చెల్లించి సర్కారుకు ఖజానా చేకూరుస్తున్నా హిందూ ఆలయాల కోసం, బోనాల కోసం డబ్బులు ఇవ్వాలంటూ ఏటా బిచ్చమెత్తుకునే దుస్థితి రావడం అన్యాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరినీ యాచించే అవసరమే లేకుండా బోనాల ఉత్సవాలతోపాటు హిందువుల పండుగలన్నింటికీ అధిక నిధులు కేటాయించి ప్రతి హిందువు గర్వించేలా ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆదివారం బోనాల సందర్భంగా లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవా రిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు.

టెర్రరిస్టుల బాంబు పేలుళ్లు, జిహాదీ గ్యాంగుల భయంతో ఇళ్లు వదిలివెళ్లిన పాతబస్తీ ప్రజలంతా తిరిగి తమ సొంత ఇండ్లకు రావాలని పిలుపునిచ్చారు. పాతబస్తీ మీది. మీకే భయం అక్కర్లేదని అన్నారు. అందరినీ రక్షించే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు.

హిందువులందరినీ ఓటు బ్యాంకు గా మార్చి హిందువుల సత్తా చాటుతామని స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీల కారణంగానే పాతబస్తీలో దారుణమైన పరిస్థితులున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.