డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన భవన నిర్మాణానికి రూ.108 కోట్లు కేటాయించడం హర్షణీయం
09-06-2026 12:00 AM
ముషీరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): లోయర్ ట్యాంక్బండ్ వద్ద గల డాక్టర్ బీఆర్‌అంబేద్కర్ నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.108 కోట్లు కేటాయించడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా కార్యదర్శి దేవి వరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం భవన నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌ను సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పా ర్టీ కార్యదర్శి జి. దేవి వరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తున్నదరు.






