16 April, 2026 | 10:43 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను...

23-05-2025 10:40 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 4, 9 వ డివిజన్ల పరిధిలో  సుధా నగర్, లోటస్ కాలనీ, యాదవ నగర్ లలో అంతర్గత రోడ్లు నిర్మాణం, సైడ్ డ్రైన్ ల నిర్మాణం కోరకు రూ.50 లక్షలతో  వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణిలు శంకుస్థాపన చేశారు. వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా నగరంలో ఏ బి సి కేటగిరీలుగా ప్రాంతాలను ఎంపిక చేసిన అత్యవసర కాలనీలకు త్వరగతిన పనులను పూర్తే చేసే పనిలో భాగంగానే శంకుస్థాపనలు చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయిని అన్నారు. కొబ్బరికాయ కొట్టిన  అనతికాలంలోనే పనులను పూర్తి చేస్తున్నామని, వర్షపు నీరు ఆగకుండా చూడాలనేది మా బాధ్యత అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి అధిక నిధులను మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలలో అండగా నిలిచిన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ  ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగస్వామ్యం అవుతున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ప్రజల సహకారం ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.