24-05-2025 12:00:00 AM
మంచిర్యాల, మే 23 (విజయక్రాంతి): జిల్లాలో వరి ధాన్యం సేకరణ జోరుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో రైతులు ధాన్యం కొనుగోలు జరగడంలేదని రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి కనిపించలేదు. అదికారులు వాహనాల కొరత లేకుండా ఉండేందుకు మంచిర్యాల జిల్లాలో నాలుగు సెక్టర్‌లుగా విభజించి ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి.
108 కేంద్రాల్లో ముగిసిన సేకరణ...
మంచిర్యాల జిల్లాలో 345 కేంద్రాల ద్వారా సివిల్ సప్లయ్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. కలెక్టర్ కుమా ర్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్ ప్రత్యేక చొరవతో మొదటి నుంచి ధాన్యాన్ని జిల్లాలోని మిల్లులతో పాటు పక్క జిల్లాల్లోని మి ల్లులకు పంపిస్తుండటంతో ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలోని 68 మిల్లులకు, పెద్దపల్లి జిల్లాలోని 110 మిల్లులకు, మంచిర్యాల జిల్లాలోని 20 మిల్లులకు ధాన్యం తర లించి దిగుమతి జరుపుతున్నారు. ఇప్పటికే 108 కేంద్రాల్లో ధాన్యం పూర్తి చేశారు. మిగితా కేంద్రాల్లో కొనసాగుతున్నాయి.
30 శాతం అధికంగా సేకరణ...
జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 19,824 మంది రైతుల నుంచి 1,46,134.320 మెట్రి క్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గత ఏడాది ఈ నెల 21వ తేదీ వరకు 1,01, 992 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కాగా ఈ ఏడాది 1,38,114 టన్నుల ధాన్యం అంటే 36,112 మెట్రిక్ టన్నుల ఎక్కువ కొనుగోళ్లు జరిగింది. ప్రతిరోజు 4 నుంచి 8 వేల మెట్రిక్ టన్నుల కాంట చేసి 358 లారీల ద్వారా 6 నుంచి 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలిస్తుండడంతో వేగంగా కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పవచ్చు.
ధాన్యం నష్టం పోకుండా చర్యలు -
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ధాన్యం తూకం వేయించడంతో పాటు తరలించేందుకు వాహనాలను సిద్ధం గా ఉంచడంతో ప్రతి రోజు 6 నుంచి 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలుతుంది. ఓపీయంఎస్ ఆధారంగా రైతులకు డబ్బులు కూడా అంతే వేగంగా జమ చేస్తు న్నాం.
ప్రతి రోజు 5 నుంచి 8 కోట్ల రూపాయలు రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నాం. రైతులు ఆటో మెటిక్ యం త్రంతో శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలు వద్దకు ఎఫ్‌ఏక్యూ ప్రకారం తీసుకుని రావాలని, అకాల వర్షాలు కురిస్తే కేంద్రాల్లో అం దుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లు వాడుకొని ధాన్యాన్ని రక్షించుకోవాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకొని మద్దతు ధరను పొందాలి.
సభావత్ మోతిలాల్, అదనపు కలెక్టర్, మంచిర్యాల