24-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బీ2బీ ఇండస్ట్రియల్ మెషినరీ, ఇంజినీరింగ్ ఎక్స్‌పోను హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కోయికె కట్టింగ్ అండ్ వెల్డింగ్ ఇండియా లిమిటెడ్ సీవోవో, డైరెక్టర్ టీ కుమగాయ్ శాన్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మనీష్ సిన్హా డైరెక్టర్ ఇండోమాక్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 25 వరకు జరగనుందన్నారు. ఈ ఎక్స్‌పోకు ఉదయం 11 నుంచి సాయంత్రం 6:30 వర కు ఉచిత ప్రవేశం కలదన్నారు. ఇది నాలుగో ఎడిషన్ అన్నారు.
ఏటా ప్రముఖ పారిశ్రామిక కేంద్రాల్లో ముఖ్యంగా జంషెడ్ పూర్, నాగ్‌పూర్, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. మెషిన్ టూల్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, వెల్డింగ్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియ ల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులపై ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ ప్రదర్శనలో ఇంజినీరింగ్ ఉత్పత్తులు, సేవలు, హెవీ, లైట్ మెషిన్లు, యంత్రోపకరణాలు, యాక్సెసరీస్, టూల్స్, సాంకేతిక పరికరాలు, ఇంజినీరింగ్ టూల్స్, అనుబంధ ఉత్పత్తుల సేవలు ప్రదర్శనలో కలవన్నారు.
టీ కుమగాయ్ శాన్ మాట్లాడు తూ.. దేశ, విదేశాల నుంచి 125కు పైగా ప్రదర్శకులు పాల్గొంటున్నారని చెప్పారు. ఇది ఇండస్ట్రియల్ మెషినరీ కొనుగోలుదారులు, అమ్మకందారులకు ప్రత్యేకంగా ఉంటుందన్నారు. 750 పైగా లైవ్ మెషిన్లను, 900 పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఈ ప్రదర్శనలో భాగం అయ్యాయయని చెప్పా రు. ఈ మూడు రోజులు దేశం నలుమూలల నుంచి 18,000 పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ ప్రదర్శనలో సు మారు రూ.400 కోట్ల వ్యాపారం జరగనుందన్నారు. ఈ ఎక్స్‌పోలో ప్రముఖ భారతీయ కంపెనీలలో అశ్విని ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్, టపారియా టూల్స్ లిమిటెడ్, ట్రాంటర్ ఇండియా, కోయికె కటింగ్ అండ్ వెల్డింగ్, కైన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డీబీ ఎంటర్‌ప్రైజెస్, హాన్స్‌పార్క్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రినిటీ అడ్వాస్డ్ సాఫ్ట్‌వేర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెటల్ ఆర్క్, నిపెన్ ఎలక్ట్రికల్, సువేరా ఫ్లూయిడ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, అశ్లోక్ సేఫ్ అర్థింగ్ ఎలక్ట్రోడ్ లిమిటెడ్, ఎసెల్, ఎంసీఎం ఇన్‌స్ట్రుమెంట్స్, ధ్రువ్సాఫ్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమి టెడ్, జైన్సన్ కేబుల్స్, ఫ్లెక్సోఫిట్ ఎంజిసోల్, పోమ్ సిస్టమ్స్, సర్వీసెస్, సెలెక్ కంట్రోల్, రత్నపార్కి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, మెస్సర్ కటింగ్, పానాసోనిక్ కనెక్ట్, కెటెక్ సీఎన్సీ, కాంటినెంటల్, ఇంగికో, ఐడియల్ పవర్, ఎంవీడీ ఫాస్టనర్స్, డైమండ్ కంఫ్రెసర్, డివైన్ లేజర్, గ్రీవ్స్ కాటన్, ఏషియన్ ఎక్విప్మెంట్, కాన్ పవర్ రబ్బర్ ఇండస్ట్రీస్, రిలయాన్ సాఫ్టెక్ లిమిటెడ్, స్పూర్స్ టెక్నాలజీ సొల్యూషన్స్, 3డీ లెవిన్ ఇంజినీరింగ్ తదితర సంస్థలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పారామౌంట్ బిల్డింగ్ సొల్యూషన్స్ రమన్ ట్రేడింగ్ డైరెక్టర్ అనీష్ అగర్వాల్ పాల్గొన్నారు.