calender_icon.png 7 February, 2026 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

07-02-2026 01:41:57 AM

18వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మామిడి శ్రీధర్

గజ్వేల్, ఫిబ్రవరి 6: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో 50 ఏళ్లు ముందుకు తీసుకు వెళ్లిన బిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని 18వ వార్డు బిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మామిడి శ్రీధర్ అన్నారు. శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలను తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని అద్భుతంగా అభివృద్ధి చేశారని, 18 వ వార్డు అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

గతంలో 9వ వార్డు కౌన్సిలర్ గా వార్డు ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. 18వార్డు ప్రజలు ఈసారి తనని గెలిపిస్తే సమస్యల పరిష్కారంలో ప్రజలకు తోడుంటానని, అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమరావతి,, మాజీ కౌన్సిలర్ రహీం, దౌలాపూర్ సర్పంచ్ మధుసూదన్, నాయకులు సమియుద్దిన్, విజయ్, నరసింహ, నవాజ్, రాజేశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు.