07-02-2026 01:40:45 AM
కోటి చెక్కుల అందజేత
నిజామాబాద్, పిబ్రవరి 6 (విజయక్రాంతి): ఇటీవల విధి నిర్వహణలో మరణించిన తెలంగాణ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి సాయం అందజేసింది. దీంతోపాటు, గత సంవత్సరం అక్టోబర్‌లో విధులు నిర్వరిస్తుండగా దుండగుల చేతిలో కత్తి పోటుకి గురై మృత్యవాత పడిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్-గ్రేషియా ఇచ్చారు. ఈ సహాయానికి సంబంధించిన చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నిజామాబాద్‌లో ఆ కుటుంబాలకు స్వయంగా అందజేశారు. నిజామాబా ద్‌లో జనవరి 23న గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. నిమ్స్‌లో సౌమ్యకు చికిత్స పొందుతూ మృతి చెందింది.