calender_icon.png 7 February, 2026 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం లీగ్ కాంగ్రెస్‌గా మార్చుకోండి

07-02-2026 01:43:12 AM

మతపరమైన రిజర్వేషన్లను సీఎం రేవంత్‌రెడ్డి పెంచే ప్రయత్నం

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తన పేరును ‘ముస్లిం లీగ్ కాంగ్రెస్’గా మార్చుకోవాలని కిషన్‌రెడ్డి విమర్శించారు. ముస్లిం లీగ్ కాంగ్రెస్ పేరుకు తెలంగాణలోని కాంగ్రె స్ పార్టీ సరిగ్గా సరిపోతుందని, గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్’ అని పేర్కొన్నారన్నారు. ము స్లింలకు 4 శాతం రిజర్వేషన్ శాశ్వతంగా ఉం డేలా చూడడానికి అవసరమైన పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను ప్రవేశపెట్టిన సందర్భంలో హైకోర్టు వాటిని రెండుసార్లు కొట్టివేసి, అటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, చెల్లవని ప్రకటించిందని గుర్తు చేశారు.

అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ సు ప్రీంకోర్టుకు వెళ్లి స్టే పొంది వాటిని అమలు చేస్తోందని తెలిపారు. నిజానికి కాంగ్రెస్ ము స్లింలకు రెండు రకాలుగా లబ్ధి చేకూర్చాలని చూస్తోందని, మతపరమైన రిజర్వేషన్ల ఆధారంగా 4 శాతం రిజర్వేషన్లను పొందడం, బీసీల్లో ముస్లింలను చేర్చడం ద్వారా మరో 10 రిజర్వేషన్లను జోడించడమనేది.. ఈ రెండు రకాల వ్యూహంతో ముస్లింలకు 14 శాతం రిజర్వేషన్లను తీసుకురావడానికి రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కుల సర్వే ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఒక సర్వేను నిర్వహించి తెలంగాణలో బీసీ జనాభాను పెద్దమొత్తంలో తగ్గించడానికి ప్రయత్నించిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ జనాభాలో నిజమైన బీసీలు 46 శాతం ఉన్నా... అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 10 శాతం ముస్లింలను కూడా బీసీలలో చేర్చి, రాష్ట్ర జనాభాలో బీసీలు 56 శాతం ఉన్నారని పేర్కొందన్నారు. అంటే బీసీలకు కేటాయించిన సీట్లలో 62 శాతం సీట్లు ఎంఐఎం చాలా సమర్థవంతంగా కైవసం చేసుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. బీసీల సాధికారత కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లు ఈ విధంగా పక్కదారి పట్టినప్పుడు, నిజమైన బీసీలకు న్యాయం ఎలా లభిస్తుంది? అని ప్రశ్నించారు. ఈ సామాజిక న్యాయ ద్రోహానికి, రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ నాయకత్వానికి బీసీలు తమ ఓట్లతోనే సమాధానం చెబుతారని హెచ్చ రించారు. 

గ్రామపంచాయతీ నిధులపై హర్షం

గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం రూ.260 కోట్లు విడుదల చేయడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.