calender_icon.png 1 July, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ పాత్ర చేయకపోతే చాలా కోల్పోయేవాడ్ని

26-06-2025 12:00:00 AM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న తాజాచిత్రం ‘కన్నప్ప’. ముఖేశ్‌కుమార్‌సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం నటుడు శివబాలాజీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివీ.. “ప్రస్తుతం మంచి కథలు వస్తేనే చేస్తున్నా. డబ్బు కోసం సినిమాలు చేయాలని అనుకోవడంలేదు.

నచ్చకపోతే దర్శక, నిర్మాతలకు మొహం మీదే చెప్పేస్తున్నా. ‘కన్నప్ప’ చర్చల టైమ్‌లో మోహన్‌బాబు.. ఇందులో శివబాలాజీకి పాత్ర ఎందుకివ్వలేదని అడిగితే, అతను చేసే పాత్ర ఇందులో కనిపించలేదని విష్ణు చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు మహాదేవశాస్త్రి కొడుకు పాత్రకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత తక్కువే. కానీ, ఓ గొప్ప పాన్ ఇండియన్ చిత్రంలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించలేదు.

మరీ సైడ్‌కి అలా నిలబడే పాత్రను ఎలా చేయాలి? అని విష్ణుని అడిగాను. అది నీ ఇష్టం అన్నారాయన. మా ఆవిడ మధుదీ అదే మాట! మొత్తానికి సరే అని ఒప్పేసుకున్నా. కానీ ఈ పాత్రను పోషించకపోతే చాలా మిస్ అయ్యేవాడ్ని. ఆ పాత్ర గొప్పదనం ఇప్పుడు అర్థమైంది. ప్రస్తుతం మోహన్‌బాబు ప్రొడక్షన్‌లోనే హీరోగా ఓ సినిమా చేస్తున్నా. నేను గతంలో ‘రెక్కీ’ మూవీ చేశాను. ఇప్పుడు ‘రెక్కీ 2’ ఫీచర్ ఫిల్మ్‌గా త్వరలో రాబోతోంది” అని చెప్పారు.