26-06-2025 12:00:00 AM
కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది హోం బలే ఫిల్మ్స్. ఈ సంస్థ విష్ణుమూర్తి దశావతారాలపై తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మహావతార్: నరసింహ’. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో రూపొందిస్తు న్న చిత్రాల్లో మొదటి సినిమాగా ఇది.. ఈ జులై 25న విడుదల కానుంది. అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఒకేసారి ఐదు భాషల్లో త్రీడీ వెర్షన్లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను బుధవారం విడుదల చేశారు. ‘నరసింహ గర్జన’ పేరుతో విడుదల చేసిన ఈ పాట.. ‘నర నర నర నరసింహా నమః’ అంటూ సాగుతోంది. సామ్ సీఎస్ స్వపర్చగా, రాకేందు మౌళి గీత సాహిత్యాన్ని అందించారు.
‘మహావతార్’ వరుస చిత్రాలు ఇలా..
హోంబలే ఫిల్మ్స్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా అందించనున్న ఏడు సినిమాల వివరాలను సైతం తాజాగా ప్రకటించింది. ఇందులో తొలిచిత్రం ‘మహావతార్: నరసింహ’ కాగా.. 2027లో మహావతార్: పరశురామ్; 2029లో మహావతార్: రఘునందన్; 2031లో మహావతార్: ద్వారకాదీశ్; 2033లో మహావతార్: గోకులానంద్; 2035లో మహావతార్: కల్కి 2037లో మహావతార్: కల్కి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇలా ఈ సినిమాలన్నీ రెండేళ్లకొకటి చొప్పున రానున్నాయి.