24 June, 2026 | 3:09 PM

Breaking News

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •   చీర్లవంచలో అరుణోదయ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ   •  

మంచు విష్ణు ఆఫీసుల్లో తనిఖీలు

26-06-2025 12:00 AM

నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మాదాపూర్, కావూరి హిల్స్‌లో ఉన్న విష్ణు ఆఫీసుల్లో రెండు బృందాలు తనిఖీలు జరిపాయి.

తాజాగా నిర్మించిన ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్టు అనుమానం రావటంతోనే అధికారులు.. ఇందుకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. తనిఖీల నేపథ్యంలో మోహన్‌బాబు.. విష్ణు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ తనిఖీల విషయమై విష్ణు స్పందిస్తూ.. ‘దాచిపెట్టేదేమీ లేదు.. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది’ అన్నారు.