17 July, 2026 | 9:51 AM

ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు ఐఏఎఫ్ పురస్కారం

15-10-2024 02:08 AM

రోమ్, అక్టోబర్ 14: ఇటలీకి చెందిన అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) ఏటా ప్రతిష్ఠాత్మకంగా అందించే ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు  2024కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ ఎంపికయ్యారు. సోమనాథ్ నేతృత్వ్యంలో శాస్త్రవేత్తలు ‘చంద్రయాన్ విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువానికి చేర్చినందుకు గాను ఐఏఎఫ్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది. అంతరిక్ష పరిశోధనలో ఇస్రో సాధిస్తున్న విజయాలను కొనియాడింది.