8 July, 2026 | 12:25 PM

రాష్ట్రానికి 9 మంది ఐఏఎస్‌లు

27-06-2024 12:20 AM

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం 

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 9 మంది ఐఏఎస్‌లను కేటాయించింది. 2020, 2021 బ్యాచ్‌కు చెందిన అధికారులను కేటాయిస్తూ బుధవారం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి భూపేందర్‌పాల్ సింగ్  ఉత్వర్వులు జారీచేశారు. తెలంగాణకు కేటాయించిన వారిలో కదిర్వాన్ పలాని (2020), శివేంద్ర ప్రతాప్ (2021), సంచిత్ గంగ్వార్ (2021), ఫైజన్ అహ్మద్ (2021), లెనిన్ విస్టల్ టప్పో (2021), పీ గౌతమి (2021), పీ పింకేశ్‌కుమార్ (2021), రాధిక గుప్తా (2021), పీ శ్రీజ (2021) ఉన్నారు.