బోనాల పండుగకు రూ.20 కోట్లు
27-06-2024 12:19 AM
మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): బోనాల నిర్వహణ కోసం సర్వం సిద్ధం అయింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నా యి. బోనాల ఉత్సవాలను అంగరం గ వైభవంగా నిర్వహించాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది.






