15 July, 2026 | 4:13 PM

Breaking News

చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •   వికలాంగుల న్యాయమైన హక్కులను అమలు చేయాలి   •   ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు   •   కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ   •   దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •   మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వండి   •  

నిద్రకు అంతరాయం ఏర్పడితే

15-11-2024 12:00 AM

కొంతమంది పిల్లలు అదేపనిగా నిద్రపో తుంటారు. అయితే తమ పిల్లాడు పాఠశాలకు బంద్ కొట్టేందుకే నిద్రపోతున్నాడని భావిస్తా రు తల్లిదండ్రులు. చాలా తక్కువ మంది పిల్లలే అలాచేస్తారు. అయితే ఎదిగే పిల్లలకు నిద్ర చాలా అవసరం అనే విషయం గుర్తుంచుకోవాలి. వారి మెదడు పనితీరుకు నిద్ర ముఖ్యం కూడా. పిల్లలు నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే తగినంత సమయం ఇవ్వాలని చెబుతున్నారు డాక్టర్లు.

అయితే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్య యనం ప్రకారం.. చిన్నపిల్లలో నిద్రకు అంతరాయం ఏర్పడితే అది ప్రమా దకరమైన పరిణామాలను కలిగిస్తుందని స్పష్టమైంది. జ్ఞాపకశక్తికి అవసరమైన నాడీ వ్యవస్థల పెరుగుదలలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. పిల్లలు నిద్రలేమితో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. పిల్లలు తక్కువ నిద్రపోవడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని పడుతుందని హెచ్చరిస్తున్నారు.