calender_icon.png 19 July, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నువ్వుంటే చాలే..

19-07-2025 01:52:19 AM

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూక’. మహేశ్‌బాబు పీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక కాగా.. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేశ్ మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలే’ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. కథానాయకు డు రామ్ స్వయంగా రాసిన పాట ఇది. భావుకత ఉట్టిపడేలా పదాల అల్లికతో కవితాత్మ కంగా సాహిత్యాన్ని కూర్చిన రామ్.. తనలో మంచి లిరిక్ రైటర్ ఉన్నాడని ఈ పాటతో నిరూపించారు. ప్రేమ నిజమైన నిర్వచనాన్ని కనుగొనడానికి హీరో చేసే ప్రయాణంలా అనిపిస్తోందీ గీతం.

ప్రేమని నిర్వచించలేమని, కేవలం అనుభవించగలమని తెలియజేస్తోంది. ఈ పాటలో హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ చూస్తే, ప్రేమను అనుభూతి చెందేలా చేస్తోంది. ఈ చిత్ర సంగీత దర్శక ద్వయం వివేక్ స్వరపర్చిన ఈ పాటను స్టార్ మ్యూజిషియన్ అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా; నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్; కథ పీ మహేశ్‌బాబు.