ఇల్లు కట్టుకుందామంటే ఇసుకతో ఇబ్బందులు పడుతున్నాం
ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక పర్మిషన్ ఇవ్వాలని కలెక్టర్ ముత్తారం కాంగ్రెస్ నాయకుల వినతిపత్రం
ముత్తారం (విజయక్రాంతి): ఇల్లు కట్టుకుందామంటే ఇసుకతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి నిర్మాణాన్ని మానేశారు నుంచి ఉచితంగా ఇసుక పర్మిషన్ ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీ హర్షకు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీలు మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాలకు గృహ నిర్మాణాల అవసరాల కొరకు మానేరు నది నుండి ఇసుక వినియోగించుకోవడానికి అనుమతిని కలెక్టర్ ను కోరామని, సానుకూలంగా స్పందించిన కలెక్టర్ పరిశీలిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






