26 April, 2026 | 6:39 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

09-12-2024 04:56 PM

ప్రమాదాలకు కారణమవుతున్న హోటల్ ను తొలగించాలని గ్రామస్తుల రాస్తారోకో

పొందుర్తి వద్ద 44వ జాతీయ రహదారిపై గ్రామస్తుల ఆందోళన

కామారెడ్డి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి వద్ద 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పొందుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ ఆరీఫ్(33) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటనతో గ్రామస్తులు సోమవారం ఉదయం 44వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. జాతీయ రహదారి పక్కన ఉన్న హెచ్పి పెట్రోల్ పంపు ఆనుకొని పొందుర్తి గ్రామ మూలమలుపు రోడ్డుపైన హోటల్ పెట్టారు. ఈ హోటల్ వలన పొందుర్తికి వెళ్లే వారికి రోడ్డుపైన వాహనం ఆపడంతో గ్రామస్తులకు రావడానికి పోవడానికి ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు.

హోటల్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. హోటల్ అడ్డుగా ఉండడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని వారు ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. పొందుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ ఆదివారం రాత్రి బైకులో పెట్రోల్ పోసుకురావడానికి వెళ్లి కారు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతినికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. సోమవారం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. గ్రామస్తుల ఆందోళన చేపట్టడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పారు. హోటల్ ను తీయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దేవునిపల్లి ఎస్ఐ రాజు సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్న గ్రామస్తులకు రచ్చజెప్పి రోడ్డు క్లియరెన్స్ చేయించారు.