30 August, 2026 | 12:20 AM

Breaking News

ఫారంపాండ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •   దశదిన కార్యక్రమంలో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్   •   స్నేహితుడి కుటుంబానికి 1996 బ్యాచ్ ఆపన్నహస్తం   •   కనుగుట్ట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా: ఎంపీ జి.నగేష్   •   గోపాల్‌పేట్‌లో పచ్చదనం పరిమళించాలి   •   నాచారం పోలీస్ స్టేషన్ సందర్శించిన చైతన్య స్కూల్ విద్యార్థులు   •   కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి వెళ్లిన వర్గవిబేధాలు   •   దోమకొండ సింగల్ విండో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం   •   రాత్రిపూటా ఆర్టీసీ రయ్ రయ్   •   అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు   •  

తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం..?

09-12-2024 04:34 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం..? ఆశావర్కర్లు మీలు తల్లుల్లా కనిపించడం లేదా..? మాతృమూర్తులపై పురుష పోలీసులతో దౌర్జన్యామా..? ఏం పాపం చేశారని ఆశా వర్కర్లను రోడ్డుపై లాగిపారేశారు? ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా? అని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.  ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్యాలను తట్టుకోలేరని కేటీఆర్ హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తమ జీతాన్ని రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ కోటిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు రూ.18 వేల వరకు వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో ఆగ్రహించిన ఆశా వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కోటి వద్దకు వచ్చి నిరసన చేపట్టారు. కోటిలో సోమవారం నాడు ప్రివెంటివ్ కస్టడీలో ఉన్న సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ చారీని ఆశా వర్కర్ కొట్టిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.