నడుస్తూనే..బోల్ట్ లా గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు!
లండన్: ఒలింపిక్స్లో రన్నర్‌లు ఒక్కొక్కరిది ప్రత్యక మైన శైలి క్రిస్టియన్ కోల్‌మన్ ఒకలా పరిగెడితే..ఉసేన్ బోల్ట్ మరో రకంగా పరిగెడతాడు. ఎవరి శరీర నిర్మాణం ప్రకారం వారు తమని తాము తీర్చి దిద్దుకుంటే ఎవరైనా ఒలెంపిక్ చాంపియన్ కావచ్చని బయో మెకానికల్ శాస్త్రవేత్త గ్లీడిల్ చెబుతున్నారు. క్రీడాకారుల శరీర ధర్మ శాస్త్రాన్ని.. బట్టి వారి క్రీడాశైలిలో తేడాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు బయో మెకానికల్ శాస్త్ర నిపుణులు వారికి తగిన సూచనలు ఇస్తారు. క్రీడాకారుల సెకనుకు ఎన్ని అడుగులు వెయ్యాలో నిర్దేశించే స్టెప్ ఫ్రీక్వెన్సీ, ఎంత వేగాన్ని ప్రాథమికంగా అందుకోవాలో చెప్పే స్టెప్ లెంగ్త్ , గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ తదితర పారామీటర్లను వారి శరీర ధర్మాన్ని బాడీ అనాటమీని అనుసరించి ఎవరికి వారు నిర్ణయించుకోవాలన్నారు. ఈ మేరకు 100మీ ఫైనల్‌లో పారా ఒలెంపిక్స్ పాల్గొనే క్రీడాకారులు సైతం ఎలా గోల్డ్ మెడలిస్టులు కావాలో ట్రెయినింగ్ ఇస్తున్నారు. ఉసేన్ బోల్ట్ లాంటి పొడవైన శరీరం, పొడవు కాళ్లున్న వారికి ఒక ఫార్మూలా రూపొందించారు. భూమిని ఉసేన్ బోల్ట్ లాంటి స్ప్రింటర్ నిలతన్నేటపపుడు గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ ఉత్పత్తి అయ్యే శక్తి ఎంత ఉందో కంప్యూటర్ మోడలింగ్ తో అంచనా వేసి అతని వేగాన్ని ప్రాథమికంగా నిర్ధారించి స్టెప్ లెంగ్త్ ఎంత ఉండాలో బయో మెకానికల్ శాస్త్రవేత్త లు అంచనా వేస్తారు. అందుకే రికార్డు సెట్టింగ్ సమయంలో 9.58 సెకన్లలో, బోల్ట్ పొడవైన కాళ్లు ఉయోగిస్తూ 2.872m (9.5ft) వరకు చిరుతలా పరుగులెత్తగలిగాడు. క్రిస్టియన్ కోల్‌మన్ వంటి యువకులు తమ కండర శక్తిని ఎక్కువ సేపు వినియోగిస్తూ చాలా కాలం పాటు తమ అడుగుల మధ్య దూరం స్టెప్ లెంగ్త్ ను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాగా అతని కాళ్ల కండర శక్తి అధికంగా ఉండటంతో గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ ను అధిగమిస్తూ ప్రతి ఒక్క అడుగునూ ఒక లాంగ్ జంప్ లా వెయ్యొచ్చు. కానీ తన కాళ్ల పొడువును తన శరీర నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకుని స్టెప్ ఫ్రీక్వెన్సీ ని నిర్ణయించుకోవల్సి ఉటుందన్నారు.






