8 May, 2026 | 4:19 AM

లావణ్య ఇంట్లో చోరీ..

10-09-2024 03:31 PM

12 లక్షలు విలువచేసే బంగారాన్ని రాజ్ తరుణ్ అపహరించాడని ఫిర్యాదు

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లావణ్య ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 12 లక్షల విలువైన బంగారం ఆభరణాలు చోరీ జరిగినట్టుగా లావణ్య తెలిపింది. సినీ హీరో రాజ్ తరుణ్, మాల్వి మనోత్తరపై అనుమానం ఉన్నట్టుగా లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతంలో తాను జైలుకు వెళ్లిన సమయంలో రాజ్ తరుణ్ కు తన ఫ్లాటు తాళపు చెవులు ఇచ్చాను అని, ఇటీవల తిరిగి ముంబైకి వెళ్ళినప్పుడు తాను కీస్ తీసుకొని వచ్చినట్లు లావణ్య పేర్కొన్నారు.

రాత్రి ఫ్లాట్ లోని బంగారాన్ని చెక్ చేయగా ఖాళీ డబ్బాలు కనిపించాయని, రాజ్ తరుణే చోరీ చేశాడని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు. ఆమె అన్న, తల్లిదండ్రులతోపాటు రాజ్ తరుణ్ 12 లక్షలు విలువ చేసే బంగారాన్ని కొనిచ్చారన్నారు. రాజ్ తరుణ్ పూసలతాడు కొనిచ్చారని, కమ్మలు గాజులు నాలుగు రింగ్స్, మిగతా నగలను తన తల్లిదండ్రులు కొనిచ్చారని ఆమె వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని లవణ్య విజ్ఞప్తి చేశారు.