15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఐకేపీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

20-10-2025 12:54 AM

సూర్యాపేట, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దాసాయిగూడెం లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రైతులు ప్రభుత్వ నిబంధన ప్రకారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కర్ణాకర్ రెడ్డి, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, టిఎంసి శ్వేత, సి ఓ ఉమారాణి, అధ్యక్షులు శిరీష, ఆర్ పి సైదమ్మ, కమిటీ సభ్యులు పద్మ, శాంతమ్మ, నిర్మల, రైతులు  తదితరులు పాల్గొన్నారు.