20-10-2025 12:51:25 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 1౯ (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వంలో ఏళ్లుగా పాతుకుపోయిన బోగస్ ఉద్యోగుల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, ప్రభుత్వ ఖజానాకు పడుతున్న భారీ గం డిని పూడ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ర్ట ఔట్‌సోర్సింగ్ జేఏసీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని ఆ సంఘ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ మహమ్మద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ర్టంలోని వివిధ శాఖలు, కార్పొరేషన్ల లో పనిచేస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పూర్తి వివరాలను ఈ నెల 25లోగా ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాం లో దాదా పు లక్ష మంది బోగస్ ఉద్యోగుల పేరుతో ఏటా రూ.1500 కోట్లు, పదేళ్లలో సుమా రు రూ.15 వేల కోట్లు పక్కదారి పట్టడం అత్యంత దురదృష్టకరమన్నారు.
ఈ మహా స్కాం కారణంగా కొందరు నాయకులు, ఏజెన్సీల నిర్వాహకులు లాభపడ గా, నిజాయితీగా పనిచేస్తున్న లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లింది. ఇప్పుడు ప్రభు త్వం చేపట్టిన ఈ ప్రక్షాళనతో బోగస్‌ల ఏరివేత జరిగి, నిజమైన శ్రామికులకు న్యా యం జరుగుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నా మని పేర్కొన్నారు.
రాష్ర్టవ్యా ప్తంగా సుమారు 4.95 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులుంటే, ఇప్పటివరకు కేవలం 2 లక్షల మంది వివరాలు మాత్ర మే నమోదు కావడం, కొన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగుల కంటే ఎక్కువ వివరాలు నమో దు కావడం వంటి గందరగోళ పరిస్థితులు ఈ బోగస్ దందా తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇంధన, గృహ నిర్మాణ శాఖల వంటివి వివరాల నమోదులో తీవ్ర నిర్ల క్ష్యం వహించడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి హెచ్చ రించినట్లు, గడువులోగా వివరాలు నమో దు చేయని వారికి అక్టోబరు జీతాలు నిలిపివేయాలన్న నిర్ణయం ద్వారానే ఈ ప్రక్రి య వేగవంతమవుతుందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రతీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తక్షణమే స్పందించి, అక్టోబర్ 25లోగా తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలను తమ శాఖాధిపతుల ద్వారా ఐఎఫ్ ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఏ ఒక్క నిజమైన ఉద్యోగి కూడా నష్టపోకూడదు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రతి ఉద్యో గికి ఒక ప్రత్యేక ఐడీ నంబరు కేటాయిస్తారని, తద్వారా భవిష్యత్తులో జీతాలు, ఈ ఎస్‌ఐ, ఈపీఎఫ్ వంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆశిస్తు న్నామని తెలిపారు.