20-10-2025 12:55:51 AM
కోదాడ, అక్టోబర్ 19: పదవ తరగతి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ ను గుర్తించి, వారికి ప్రోత్సాహం అందించేందుకు స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహించినట్లు క్రినిధి ఫౌండేషన్ నిర్వాహకులు, ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి తెలిపారు. కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ లో గల ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ ఆవరణలో క్రినిధి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం పదవ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహించారు.
ఈ టెస్టులో సుమారు 950 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ చౌదరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించి వారిని జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్కాలర్ షిప్ టెస్ట్ కు విద్యార్థుల నుండి అపూర్వ స్పందన వచ్చిందని అన్నారు.
స్కాలర్ షిప్ టెస్ట్ లో పాల్గొన్న వారిలో విద్యార్థి, విద్యార్థులలో మొదటి ఐదుగురికి మొత్తం పది మందికి బహుమతులు అందించారు. ఈ టెస్ట్ లో బాలికల విభాగంలో షేక్ మానా ఫస్ట్ ప్రైజ్, షేక్ సమీరా సెకండ్ ప్రైజ్ లు సాధించగా బాలుర విభాగంలో వీ. శశాంక్ ఫస్ట్ ప్రైజ్, బి. పరశురామ్ సెకండ్ ప్రైజ్ సాధించారు. వీరికి కాలేజ్ చైర్మన్ రాజేష్ చౌదరి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరెస్పాండెంట్ వేణుగోపాల రావు, ప్రిన్సిపాల్ జీ. వెంకటరమణ, అకడమిక్ అడ్వుజర్ మైనం రామయ్య, వైస్ ప్రిన్సిపాల్ పీ. ఎన్. ఆర్., క్యాంపస్ ఇంచార్జులు మౌనిక, ప్రవీణ్, పీ ఆర్ వఓ మల్లికార్జున రావు,లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.