రాములోరి కల్యాణానికి ఇల్లందకుంట ముస్తాబు
ఏర్పాట్లు పూర్తి.
27న రాము లోరీ కళ్యాణం
హుజురాబాద్,మార్చి25: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియో జకవర్గ కేంద్రంలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మార్చి 25 ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలుఘనంగా ప్రారంభమైనయి.26న చైత్ర శుద్ధ అ ష్టమి గురువారం రాత్రి 7-00 గంeలకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, రక్షాబం ధనము, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ27న చై త్ర శుద్ధ నవమి శుక్రవారం ఉe 10-00 గంటలకు ధ్వజారోహణము, ఉe 11-00 గంటల కు ఎదురుకోళ్ళు మరియు మe 12-00 గంeలకు ‘శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము‘ రాత్రి 8-00 గంటలకు ‘హంస వాహన సేవ‘ ఉంటుంది.
28చైత్ర శుద్ధ దశమి శనివారం ఉe 11-00 గంటలకు ‘పట్టాభిషేక మహోత్సవము‘ ‘నువర్ణ పుష్పా ర్చన‘ సాe 5-00 లకు ప్రభుత్వోత్సవము ప్రారంభము. రాత్రి 8-00 గంటలకు ‘శేష వాహన సేవ‘29న చైత్ర శుద్ధ ఏకాదశి ఆదివారం సాe 5-00 గంeలకు ప్రభుత్వోత్సవ ము, రాత్రి 8-30 గంటలకు ‘గరుడ వాహన సేవ‘ భక్తుల మొక్కుబడుల సేవలు ప్రా రంభం.30న చైత్ర శుద్ద ద్వాదశి సోమవారం సా 5-00 గంeలకు ప్రభుత్వోత్సవము, రా త్రి 8-00 గంeలకు ‘హనుమత్ వాహన సే వ‘31న చైత్ర శుద్ధ త్రయోదశి మంగళవారం సాe 5-00 గంటలకు ప్రభుత్వోత్సవము, రాత్రి 8-00 గంటలకు ‘గజ వాహన సేవ‘ రాత్రి 9-00 గంటలకు సదస్యము.
ఏప్రిల్ 01 న చైత్ర శుద్ధ చతుర్దశి బుధవారం సాe 5-00 లకు ప్రభుత్వోత్సవము ముగింపు, రాత్రి 9-00 లకు ‘అశ్వ వాహన సేవ‘ (దోపోత్సవము )2 న శుద్ద పౌర్ణమి గురువారం రోజున సాe 5-00 గంటలకు ‘శకటోత్సవము‘ (బండ్లు తిరుగుట) రాత్రి 9-00 గటలకు ‘సూర్య రధోత్సవము‘ (చిన్నరథము). ఏప్రిల్ 3న చైత్ర బ| పాడ్యమి శుక్ర వారం రాత్రి 9-00 లకు ‘చంద్ర రథము‘ (పెద్దరథము) మీదకు వేంచేయును. ఏప్రిల్ 4న చైత్ర బe విదియ శనివారం మe 3-00 గం లలోపు వరకు భక్తులకు చంద్ర రథము పైన శ్రీ స్వామి వార్ల దర్శనము అనంతరం తిరుమాడ వీధులలో చంద్రరధోత్సవము (పెద్ద రథం) ఊరేగింపు జరుగును. మరియు సాe 7-00 గంeలకు మహా పూర్ణాహుతి. ఏప్రిల్ 5న చైత్ర బe తదియ ఆదివారం ఉe 11-00 గంటలకు నపకళశ స్నపన, ‘చక్రతీర్ధము‘ శంఖాధార చక్రధార సహస్రధార చేయించి ఇచ్చిన దాతల పేర్లతో తిరుమంజనం, రాత్రి 8-00 గంeలకు గరుడ సేవ, రాత్రి 9-00 గంeలకు ‘శ్రీ పుష్పయాగము‘ (నాఖబలి) ఏప్రిల్ 06న చైత్ర బ|| చవితి సోమవారం రాత్రి 9-00 గంeలకు ‘సప్తవర్ణాలు‘ ‘ఏకాంతసేవ‘ బ్రహ్మోత్సవాలు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
’దక్షిణ అయోధ్య’గా పిలువబడే ఈ ఉత్సవంలో పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఘనంగా వేడుకలు జరగనున్నాయి.సీతారామ కళ్యాణం కార్యక్రమానికి భక్తులను ఆహ్వానించేందుకు ప్రత్యేక ప్రచార రథాలు పది మండలాల్లో పర్యటిస్తున్నాయి. సుమారుగా లక్ష మంది భక్తులు హాజరవుతారని అధికారులుఅంచనా వేస్తున్నారు.అధికారులు సుమారు భక్తుల కోసం కోసం గ్యాలరీలు, వైద్య సహాయం, తాగునీరు, వసతి వంటి సౌకర్యాల ఏర్పాట్లను ఖరారు చేశారు.
రామలోరి పెళ్లికి అన్నీ సిద్ధం గా ఉన్నాయి! నేటి నుంచి ఎల్లంతకుంటలో బ్రహ్మోత్సవాలకురెండు సమీక్షా సమావేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి; పది మండ లాల్లో ప్రచార రథాలు తిరుగుతున్నాయి ప్రధాన పాఠం కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో, దక్షిణ అయో ధ్యగా ప్రసిద్ధి చెందిన ఎల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 27వ తేదీన ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆల య కమిటీ చైర్మన్ రామారావు, ఈఓ సుధాకర్ తెలిపారు.
ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ షెడ్లు, విద్యుత్ దీపాలతో అలంకరణలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, సైదాపూర్, మొగుళ్లపల్లి, చిట్యాల్, రేగొండ, కాల్వశ్రీరాంపూర్, ఓదెలతోపాటు పది మండలాల్లో సీతా రామ కళ్యాణ విశిష్టతను తెలిపే ప్రత్యేక ప్రచార రథాలు భక్తులను ఆహ్వానిస్తున్నాయి.
అధికారిక సమన్వయం
బ్రహ్మోత్సవాలు సజావుగా జరిగేలా చూసేందుకు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను తనిఖీ చేశారు.
వేసవిని దృష్టిలో ఉంచుకుని, త్రాగునీరు, నీడ, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యాలకు సంబంధించి కలెక్టర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. వివాహ రోజున సుమారు లక్ష మంది భక్తులకు ఒకేసారి అన్నదానం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.




