26 March, 2026 | 2:48 AM

భక్తిశ్రద్ధలతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రతిష్టాపన

26-03-2026 12:59 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి ౨౫ (విజయక్రాంతి):  రెబ్బెన మండలం దేవాలగూడలో బుధ వారం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాలు, ధ్వజ శిఖర ప్రతిష్టాపన మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, భక్తి భావం పెరుగుతుందని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.