నెంబర్ ప్లేట్లు పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు...

06-10-2026 | 03:35pm

ఏఎస్పి  రిత్విక్ సాయి కొట్టే..

ఉట్నూర్, అక్టోబర్ 6 ( విజయక్రాంతి) : వాహనాలకు నెంబర్ ప్లేట్లు  లేని వాహనాల పత్రాలు లైసెన్సులు, బీమా పత్రాలు లేకుండా గ్రామాల్లో నాటు సార (గుడుంబా) తయారు చేసిన గంజాయి లాంటి మాధక  ద్రవ్యాలు విక్రయించిన చట్టాలను ఉల్లంఘించి ప్రవర్తించిన చర్యలు తీసుకుంటామని  ఉట్నూరు ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే(Utnoor ASP Rithvik Sai Kotte) హెచ్చరించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఉట్నూర్ మండలంలోని కేంద్ర కాలనీలో మంగళవారం  కార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వాహన పత్రాలు లేని  30 మోటార్ సైకిల్ లను నెంబర్ ప్లేట్లు లేనీ రెండు ఆటోలను 5 లీటర్ల గుడుంబా, ఎక్సైజ్ బిర్ 7 బాటిలను ఐదు కేజీల ఇప్పపువ్వు పట్టుకోని ధ్వంసం చేసినట్లు ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు విరుద్ధంగా వ్యవహరించకూడదని చట్టాలను పరిరక్షించాలని  కోరారు. ఎవరైనా చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన, ఉ ల్లంగించిన  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ 

కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో  ఏఎస్పీ  రిత్విక్ సాయి కొట్టే, ఉట్నూర్ సిఐ మాడావి ప్రసాద్,  ఉట్నూర్ ఎస్సై విజయ్ కుమార్, ఇంద్రవెల్లి ఎస్ఐ సాయన్న , 30 మంది వరకు పోలీసు బృందం ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు