తై బజార్ పేరుతో అక్రమ వసూళ్లు
- తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న మామిడి రైతులు, వ్యాపారులు
- నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిగా దోపిడీ
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
నాగర్ కర్నూల్ మే 3 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మామిడి రైతులు వ్యాపారుల వద్ద కొంత మంది వ్యక్తులు తైబజార్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చెమటోడ్చి కష్టపడి పం టను కాపాడుకున్న మామిడి రైతులు అ మ్ముకునేందుకు వ్యాపారం చేసుకుంటున్న క్రమంలో కొంతమంది అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తైబజార్ పేరుతో రకం కట్టాలని నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చిన విధంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని మామిడి రైతులు, వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అడిగిన డబ్బులకు సంబంధించిన రసీదు ఇవ్వాలని కోరినా దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం ము న్సిపాలిటీలో తై బజార్ వేలం దక్కించుకున్న సదరు వ్యక్తులు మామిడి పండ్లు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసుకునే కొట్టు కోసం 28 రూపాయలు తైబజార్ చెల్లించాల్సి ఉంది. కానీ మా మిడి పండ్లను తరలిం చే ట్రే ఒక్కొక్కటి చొప్పున 100 రూపాయలు ఇవ్వాల్సిందేనని మామిడి పండ్లు అమ్ముకునే వ్యాపారుల వద్ద కూడా ఒక్కొక్కరి నుండి 100 రూపాయలు చొప్పున ము క్కు పిండి వసూళ్ళు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి చివాట్లు పెడుతున్నారని వ్యాపారం చేసుకోనివ్వం అంటూ హెచ్చరిస్తున్నారని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను తై బజార్ పేరుతో అధికార పార్టీకి చెందిన లీడర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందిన కాడికి వసూళ్లు..
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ని తై బజార్ వేలం దక్కించుకున్న సదురు కాంట్రాక్టర్ గతంలో కూడా తానే నిర్వహిస్తూ మున్సిపాలిటీకి సుమారు ఆరు లక్షల బకా యి పడ్డాడు. అయినా సంబంధిత అధికారు లు కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూళ్ళు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు మరో మారు మళ్లీ తనకే అప్పగించడం వెన క కొంతమంది కౌన్సిలర్లు, అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వీ ధి వ్యాపారులు తోపుడు బండ్లు, టీ స్థాల్, పండ్ల వ్యాపారులు, రైతు కూలీలతో పాటు ఇతర వాహనాల నుండి అధిక మొత్తంలో తై బజార్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయినా పర్యవేక్షణ చేయాల్సిన సదరు అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.కొద్ది కాలంలోనే పరిమితికి మించి ఆదాయం పెంచుకుంటున్నప్పటికీ మున్సిపాలిటీకి బకాయి పడ్డ డబ్బులు మా త్రం చె ల్లించడంలో అలసత్వం చూపుతున్నారని అ యినా అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ ఆదాయానికి గండిప డుతోందని మండిపడుతు న్నారు. అ ధికార పార్టీకి చెందిన పాలకవర్గం ఉన్నప్పటికీ ఈ వ్యవహారం పట్ల స్పందించకపోవ డం పలు అనుమానాలకు తావిస్తోంది.
తైబజార్ వేలం ధరల పట్టిక అంశాన్ని ప్రచారం చేస్తాం
తైబజార్ కాంట్రాక్టు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ నిబంధనల మేరకే డబ్బులు వసూలు చేయాలని పలుమార్లు హెచ్చరించాం. ప్రస్తుతం ధరల అంశాన్ని కూడా బహిర్గతం చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాం. నిబంధనలను అతిక్రమిస్తూ అధిక వసూలు చేస్తే కాంట్రాక్ట్ రద్దు చేస్తాం.
నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్ కర్నూల్.






