16 August, 2026 | 6:33 PM

ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి

16-08-2026 04:55 PM

-కోహెడ ఎంపీడీఓ కృష్ణయ్య

కోహెడ,ఆగష్టు16,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ కృష్ణయ్య తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం  జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు హాజరుకానున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కారమే.. ప్రజావాణి లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.