15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తెల్లాపూర్ సర్వేనంబర్‌లో అక్రమ నిర్మాణాలు

29-03-2025 12:11 AM
  • మంత్రి పొంగులేటికి ఫిర్యాదు చేసిన స్థానికులు

రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారుల సంయుక్త సర్వే

పటాన్ చెరు, మార్చి 28 :తెల్లాపూర్ మున్సిపాలిటీ సర్వేనంబర్ 324లోని నారాయణరావు వెంచర్ కు ఆనుకొని  ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై స్థానికులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే చేపట్టారు.

గతంలో నారాయణరావు వెంచర్ లోని ఏ బ్లాక్  లో హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉన్న స్థలంలో  ఉన్న ఫెన్సింగ్ ను ధ్వంసం చేసి లేని రోడ్డును చూపించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని మంత్రికి ఫిర్యాదు అందింది. దీంతో విచారణ జరుపాలని మంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు రామచంద్రాపురం మండల రెవెన్యూ అధికారులు హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించారు.