calender_icon.png 5 May, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదవండి... ఎదగండి

29-03-2025 12:11:48 AM

అత్యాధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోండి 

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

మహబూబ్ నగర్ మార్చి 28 (విజయ క్రాంతి) : బాగా చదవండి ఉన్నత స్థాయికి ఎదగాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎఐ ల్యాబ్ ను, జడ్చర్ల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన  యానిమల్ బర్డ్ సెంటర్ ను ప్రారంభించడంతోపాటు చంద్ర గార్డెన్ లో ముస్లిం మైనార్టీ లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అందరి సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. రంజాన్ వేడుకలను సోదర భావంతో ఘనంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసి పండ్లు తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు.