12-06-2025 12:31:30 AM
స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకొని అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ : 11 పెద్ద అం బర్‌పేట్ మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాలలో అక్రమ నిర్మాణాల జోరు కొనసా గుతున్నాయి. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం భారీగా గండి పడుతుంది. అధికారుల పర్యవేక్షణ అలసత్వం నే సాకు గా తీసుకొని అక్రమ నిర్మాణదారులు తమ నిర్మాణాలను కొనసాగించడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణదారులు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అను మతులు తీసుకోకుండానే కమర్షియల్ షెట్ట ర్లు నిర్మిస్తూ తమ జేబులు నింపుకుంటున్నా రు.
పెద్ద అంబర్‌పేట్ నుంచి మునగనూరు వెళ్లే దారి ఎలాంటి అనుమతులు తీసుకుండానే జోరుగా నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యరిస్తున్నా రు. ఈ ప్రాంతం ఎఫ్‌టీఎల్‌లో పరిధిలో ఉంటుందని స్థానికులు ఆరోపిస్తూ.. ఇటీవలనే హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదులు సైతం చేశారు. పెద్ద అంబర్‌పేట్ నుంచి మునగనూరు వెళ్లి రహదారికి ఈ నిర్మాణాలుంటా యి.
ఈ రోడ్డు విస్తీర్ణంలో భాగంగా 100 ఫీట్లు పెంచి.. నిర్మాణానికి నిధులు కూడా కేటాయిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రోడ్డు డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గతంతో ప్రక టించారు. అలాంటి తరుణంలో నిర్మాణాలు చేసేటప్పుడు సెట్ బ్యాక్ చేసి.. నిర్మాణాలు చేపట్టాలి. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నిర్మాణాలు కబ్జా గురవుతున్నఈదుల చెరువు. అక్రమ నిర్మాణాల సమీ పంలోనే ఈదుల చెరువు ఉంటుందని స్థానికులు చెప్తున్నారు.చెరువు సర్వే నెంబర్ 292 పూర్తి విస్తీర్ణం సుమారు 150 ఎకరాలు. ఈ దుల చెరువు ఎఫ్‌టీఎల్ ఏరియా చాలా వర కు కబ్జాకు గురువుతందన్నారు. సంబంధిత అధికారులు తాయీలాలకు అలవాటుపడి కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
కింది స్థాయి సిబ్బంది నుంచి పై అధికారులకు వరకు ఇదే పని పెట్టుకున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఎ న్ని ఫిర్యాదులు అందిన అధికారులు మా త్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో కొనసాగే అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకొని ఈదుల చెరువును కాపాడాలని మున్సిపాలిటీ అధికారులను మున్సిపాలిటీ ప్రజలు వేడుకుంటున్నారువేడుకుంటున్నారు.