అక్రమ ఇసుక లారీ పట్టివేత
దమ్మపేట,(విజయక్రాంతి): శుక్రవారం ముష్టిబండ గ్రామ శివారులో తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా రవాణా చేస్తున్న ఇసుక లారీని ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి దాడి చేసి పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇట్టి ఇసుక లారీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన దాచారం ఇసుక ర్యాంపు, కుక్కునూరు మండలం నుండి బయలుదేరి అశ్వరావుపేట మీదగా దమ్మపేట మండలం ముష్టిబండ మీదగా వెళ్తుండగా అట్టి ఇసుక టిప్పర్ లారీను, డ్రైవర్ ని అదుపులో తీసుకొని, ఇసుకను లోడ్ చేయించిన వారి మీద, రవాణా చేయించిన వారి మీద, లారీ ఓనర్ మీద, దిగుమతి చేసుకునే వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని, కావున తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా ఈ విధంగా అక్రమ ఇసుక వ్యాపారం చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.






