calender_icon.png 2 November, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలి

01-11-2025 06:39:31 PM

సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి..

కరీంనగర్ (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా నేలమట్టమై దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, కనీసం ప్రభుత్వం ప్రకటించిన ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించి రైతులకు భరోసాగా ప్రభుత్వం నిలవాలని సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో దెబ్బతిన్న వరి పంటలను, రోడ్లను, లో లెవెల్  బ్రిడ్జిలను సిపిఐ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలతో రైతుల పంటలకు అపారమైన నష్టం వాటిలిందని, కోతకు వచ్చిన వరి పంటలు పూర్తిగా నీలమట్టం అయ్యాయని, వరి కోసి వడ్లు కుప్పలు చేసిన, ఆరబోసిన రైతుల ధాన్యాలు పూర్తిగా తడిచిపోయి కొట్టుకపోయి తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

పంటలు నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్నీ ప్రభుత్వం ఆదుకోవలసిన అవసరం ఉందని, తక్షణమే సంబంధిత అధికారులచే క్షేత్ర స్థాయిలో సర్వే చేయించి అంచనాల నివేదికను ప్రభుత్వానికి అందించాలని, ప్రభుత్వం ప్రకటించిన ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే రైతులకు అందించి వారికి భరోసా కల్పించాలని, బ్రిడ్జిల నిర్మాణంచేసి, చెడిపోయిన రోడ్లుకు తక్షణమే మరమ్మతులు చేయాలి వెంకటరెడ్డి కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్, సింగిల్ విండో డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోల రాజయ్య, మాజీ ఎంపీటీసీ పరకాల కొండయ్య, నాయకులు నీల వెంకన్న, తమ్మిశెట్టి రవీందర్, విలాసాగరం అంజయ్య, రాచర్ల రంగయ్య, బోయిని రాజు, ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి చెంచల రవి, తదితరులు పాల్గొన్నారు.