01-11-2025 06:42:39 PM
రాజాపూర్: రక్తదానం చేసే మీ దాతృత్వం మరొకరి జీవితంలో సరికొత్త ఆశను చిగురింపజేస్తుంది అని సాటి మనిషి ప్రాణాలు జిల్లా ఎస్పీ జానకి అన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాలు పురస్కరించుకొని రాజాపూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటంలో రక్తదానానికి మించిన దానం లేదని అన్నారు.
నేడు రోడ్డు ప్రమాదాలు తల సేమియా బాధితులు కిడ్నీ బాధితులు వంటి ఎందరుకు మీరు అందించే ప్రతి రక్తపుబొట్టు వారి ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. యువత రక్తదానం చేసేందుకు ముందుండాలన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం చేసినందుకు ఎస్సై శివానంద్ గౌడ్ మరియు మండల ప్రజలు యువకులు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు, సిఐ నాగార్జున గౌడ్, బాలానగర్ ఎస్సై లెనిన్, మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర నాయుడు, పోలీస్ సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.