13 April, 2026 | 11:16 PM

క్షేత్ర పర్యటనతో విద్యా ప్రమాణాలు మెరుగు

04-11-2025 08:23 PM

కుమ్రం  భీం  ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విద్యా ప్రయోజనాల కోసం వివిధ ప్రాంతాలలో క్షేత్ర పర్యటన చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలను పరిచయం చేశారు. విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రం, జిల్లా అగ్నిమాపక కేంద్రం, కూరగాయల మార్కెట్ ను సందర్శించారు.

విద్యార్థులు ఈ శాఖల కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలపై అవగాహన కల్పించేందుకే క్షేత్ర పర్యటన చేపట్టినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులను కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఎస్పీ కాంతిలాల్ సన్మానించి, పిల్లలతో మాట్లాడారు. కృషి, క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తులో మంచి అధికారులు కావచ్చని సూచించారు. ఈ విద్యా పర్యటనలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రేష్మ, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.