14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

అన్ని సబ్జెక్టులు చదవాలి.. రాయాలి

21-02-2026 03:25 PM

గత ప్రశ్నాపత్రాలు సాధన చేయాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

అల్మాస్ పూర్ వద్ద ఉన్న కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట, పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి.. రాయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా, పరిశీలించారు.

పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తి అయిందా అని ఇంచార్జి కలెక్టర్ ఆరా తీశారు. సైన్స్ కు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో నాడీకణ నిర్మాణ నమూనాను బోర్డుపై గీసి దాని భాగాలు వివరిం చాలని సూచించారు. పలువురు విద్యార్థులు గీయగా, వారిని అభినందించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని తెలిపారు. విద్యార్థులు ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతి సబ్జెక్టుకు సంబంధించి గత ప్రశ్నాపత్రాలు సాధన చేయాలని సూచించారు.

ఆ సమాధానాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి మార్కులే ఉన్నత విద్యాభ్యాసంలో కీలకంగా మారుతాయని వివరించారు. ఇప్పటి అంశాలే రానున్న తరగతుల్లో మరింత విస్తృతంగా ఉంటాయని తెలిపారు. మంచిగా చదివి వివిధ ఉన్నత ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కెరీర్ లో స్థిరపడిన తరువాతే మిగితా విషయాలు ఆలోచించాలని సూచించారు.నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. విద్యాలయంపైన అదనపు తరగతి గదుల నిర్మాణాలపై టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈల నుంచి ఆరాతీశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.