25 June, 2026 | 2:43 AM

ఇందిరా మహిళా శక్తి.. మహిళలకు ఆర్థిక భరోసా..

25-06-2026 01:36 AM

డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్

మేడిపల్లి,జూన్ 24 (విజయక్రాంతి):  ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బుధవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి డివిజన్ పరిధిలోని పర్వతాపూర్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని,  కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, వారి కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటునందించడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివ గౌడ్, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.