calender_icon.png 7 February, 2026 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో సుపరిపాలన ప్రచార అస్త్రంగా జనంలోకి దూసుకెళ్తున్న వకీల్ సాబ్

07-02-2026 12:42:15 AM

  1. మంథని మున్సిపల్ 5వ వార్డులో ముస్కుల సయేందర్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం

విజయం మీదే అంటూ వకీల్ సాబ్ కు  అడుగడుగున ప్రజలు నీరాజనం

మంథని ఫిబ్రవరి ౬  (విజయక్రాంతి) మంథని లో సుపరిపాలన ప్రచార అస్త్రంగా  జనంలోకి  వకీల్ సాబ్ దూసుకెళుతున్నారు.మంథని పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డు లో  కాంగ్రెస్ పార్టీ నుంచి  పోటీ చేస్తున్న ప్రముఖ సీనియర్ వకీల్ సాబ్ ముస్కుల సయేందర్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో గురువారం ముమ్మరంగా ప్రచారం చేశా రు.  విజయం మీదే అంటూ వకీల్ సాబ్ కు  అడుగడుగున ప్రజలు నీరాజనం పడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సుపరిపాలన ప్రచార అస్త్రంగా  మలుచుకుని ప్రజల్లోకి దూసుకెళ్తున్నాడు.  సయేందర్ రెడ్డి సీనియర్ న్యాయవాది,  విద్యావేత్త కావడంతో ప్రజలు సుయేందర్ రెడ్డి వైపు చూ స్తున్నారు. 5వ వార్డులోని బోయినపేట లోని ఉదయం ఇంటింటికి తిరుగుతూ ఆప్యాయంగా ప్రజలను పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. 

గొల్లగూడెం, గంగాపురి, కూచిరాజ్ పల్లి లో  గడప గడపకు తిరిగి చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ల ఆశీర్వాదాలతో  5వ వార్డు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. వకీల్ సాబ్ కు  ప్రజలు నీరాజనాలు పలికారు.