30 June, 2026 | 8:33 PM

Breaking News

వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •   రమాదేవి సేవలు చిరస్మరణీయం   •  

పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు

30-06-2026 07:49 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించొద్దని మఠంపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ అన్నారు. మంగళవారం పెదవీడు గ్రామంలోని దళితవాడలో పౌర హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుల వివక్ష,అంటరాని తనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాల వారు వర్గ భేదాలు లేకుండా సోదర భావంతో ఐక్యంగా మెలుగుతూ జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీల రక్షణకు భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండి దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.పోలీసులు మాట్లాడుతూ పౌర హక్కులను భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం అధికారులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.