30 June, 2026 | 8:33 PM

Breaking News

వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •   రమాదేవి సేవలు చిరస్మరణీయం   •  

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

30-06-2026 07:51 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని గోపాల్‌పేట్ గ్రామంలో ఈగల్ బృందం నార్కోటిక్స్ డ్రగ్స్ డాగ్ భాగంగా సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, గుట్కా, పొగాకు, సిగరెట్లు, సాగర్, ఇతర నిషేధిత లేదా హానికర పదార్థాల అక్రమ నిల్వ, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించరాని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.గోపాల్పేట్ గ్రామంలోని కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, టీ స్టాళ్లు, విద్యా సంస్థల పరిసరాలు, పాఠశాలలు, కళాశాలల ఆవరణలు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

డాగ్ స్క్వాడ్ సహాయంతో పలు ప్రాంతాలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా దుకాణదారులకు మరియు ప్రజలకు మాదక ద్రవ్యాలు, గుట్కా, పొగాకు వంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను విక్రయించడం, నిల్వ చేయడం లేదా వినియోగించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు మరియు ఇతర నిషేధిత పదార్థాల విక్రయాలు జరిపితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యకలాపాల యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం మరియు మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే ఈ ప్రత్యేక లక్ష్యం అని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.