30 June, 2026 | 9:00 PM

Breaking News

పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •  

యజమాని ఇంట్లో భారీచోరీ

07-02-2026 12:41 AM
  1. పుట్టినరోజంటూ మత్తుమందు కూల్డ్రింక్స్ ఇచ్చి.. 
  2. రూ.20 లక్షల సొత్తుతో పరారైన నేపాలీ వంట మనిషి
  3.   15 రోజుల క్రితమే జూబ్లీహిల్స్‌లో పనిలో చేరిన నిందితుడు

హైదరాబాద్ సిటీబ్యూరో/జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 06 (విజయక్రాంతి): నమ్మకంగా పనిలో చేరాడు. అదనుచూసి, పుట్టినరోజు వేడుకంటూ తోటి సిబ్బందికి మత్తు మందు కూల్‌డ్రింక్స్ ఇచ్చి.. యజమాని ఇంట్లో భారీచోరీకి పాల్పడ్డాడు ఓ నేపాలీ వంటమనిషి. రూ.20లక్షలసొత్తుతో ఉడాయించాడు.

ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. జూబ్లీహిల్స్‌లో ని నందగిరి హిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి ఇంట్లో 15 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన భువన్‌కుంట పనిమనిషిగా చేరాడు. చాలా వినయంగా ఉంటూ అందరి నమ్మకాన్ని చూరగొన్నాడు. గురువారం రాత్రి య జమానులు ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పథకం వేశాడు. తన పుట్టినరోజు అని చెప్పి అక్కడి వాచ్‌మెన్‌కు, ఇతర పని మనుషులకు కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు.

అప్పటికే అం దులో నిద్రమాత్రలు కలపడంతో, అది తాగి న కొద్దిసేపటికే వారంతా గాఢనిద్రలోకి జారుకున్నారు. దీతో భువన్ ఇంట్లోకి చొరబడి సుమారు 40 తులాల బంగారు, వజ్రాభరణాలు, కొంత నగదును మూటగట్టుకుని పరారయ్యాడు. శుక్రవారం ఉద యం ఎంతకీ పనిమనుషులు నిద్ర లేవకపోవడంతో అనుమా నం వచ్చిన స్థానికులు, యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిం చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడు బ్యాగుతో వె ళ్తున్న దశ్యాలు రికార్డయ్యాయి. పాతనేరస్తులైన నేపాలీ ము ఠాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నగర సరిహద్దులు దాటక ముందే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. పని మనుషులను నియమించుకునేటప్పుడు కచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.