calender_icon.png 28 September, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

28-09-2025 12:27:13 AM

కంప్లీట్ యాక్టర్‌కు కాదేదీ అసాధ్యం.. 

మోహన్‌లాల్ అవ్వడానికి మలయాళ నటుడే అయినా కానీ దాదాపు దక్షిణాదిన ఉన్న అన్ని భాషల్లో ఆయన నటించారు. విలన్‌గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఆయన  సూపర్‌స్టార్‌గా ఆవిర్భవించారు. ఆయన సినీరంగానికి చేసిన సేవలకు గానూ ప్రభుత్వం తాజాగా ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుతో సన్మానించింది. 

వాంగ్‌చుక్ దీక్షకు చెక్

లడఖ్‌కు రాష్ట్రహోదా కల్పించడంతో పాటు ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని నిరాహార దీక్ష చేసిన పర్యావరణ వేత్త వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆయన స్వచ్ఛంద సంస్థకు ఫారిన్ ఫండింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. ఇటీవల లేహ్‌లో జరిగిన హింసకు వాంగ్‌చుక్ వ్యాఖ్యలే కారణం అని ఆరోపణలున్నాయి.