calender_icon.png 28 September, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలే!

28-09-2025 12:23:23 AM

  1. ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  2. మరో 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
  3. అక్టోబర్ 2 వరకు కురిసే అవకాశం

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేటి నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామా బాద్, కరీంనగర్, పెద్దపలి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే మరో 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని సూచించింది.