15 June, 2026 | 11:42 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఈ వారం వార్తల్లో..

01-03-2026 12:22 AM

సంధికాలంలో పన్నీర్ సెల్వం

తొలినాళ్లలో అన్నాడీఎంకే కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పన్నీరు సెల్వం సీఎం వరకూ ఎదిగారు. పార్టీ అధినేత్రి జయలలితకు విశ్వాసపాత్రుడయ్యారు. ఆమె జైలుకు వెళ్లిన సందర్భాల్లో మూడుసార్లు ఆపత్కాల సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మరణం తర్వాత అనూహ్యంగా పార్టీ నుంచి బహిష్కృతుడయ్యారు. తాజాగా డీఎంకే గూటికి చేరారు. ఆయన గమనమేంటో ఇకపై తేలాలి..

పడిలేచిన కెరటం కేజ్రీవాల్

ఒక సివిల్ సర్వెంట్ సైతం సీఎం కావొచ్చని అరవింద్ కేజ్రీవాల్ నిరూపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీ రాజకీయాలను శాసించారు. దేశ రాజధానిలో విద్యా వికాసానికి బాటలు వేశారు. తర్వాత అనుయాయులతోపాటు ఆయన కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారు. చివరకు కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వచ్చారు. ఇక తాను ఢిల్లీ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానని శపథం చేశారు. ఇక ఆ పొలిటికల్ గేమ్ చూడాల్సిందే!!