4 September, 2026 | 10:41 PM

Breaking News

శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •  

ఈ వారం వార్తల్లో..

08-06-2025 | 12:00am

హమ్మయ్య.. కప్పు కొట్టేశాను

ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ ఆర్సీబీకి మాత్రమే కాదు మరొక వ్యక్తికి కూడా ప్రత్యేకం. అతడే విరాట్ కోహ్లీ. 18 సంవత్సరాలుగా ఒకే జట్టుకు ఆడుతూ వస్తోన్న కోహ్లీ ఐపీఎల్ కప్పు కోసం చకోర పక్షిలా ఎదురుచూశాడు. తన లక్కీ నంబర్ ‘18’ ప్రాముఖ్యతను తెలిపేలా సరిగ్గా ఐపీఎల్ 18వ సీజన్‌లోనే ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడం విశేషం. మొత్తానికి కోహ్లీ కప్పు కొట్టడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

2026 ఏప్రిల్..ఇది ఫిక్స్

బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ సారథి గా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అల్లర్ల తో అట్టుడికిన బంగ్లాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఇటీవల ఎన్నికల గురించి అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇదే ఏడాదిలో ఎన్ని కలు నిర్వహించాలని పలు పార్టీలు పట్టు బట్టాయి. కానీ యూనస్ ప్రభుత్వం ఆ నిరసనలకు, వాళ్ల డిమాండ్లకు తలవంచ లేదు. 2026 ఏప్రిల్ నెలలో బంగ్లాలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ బక్రీద్ వేళ ప్రకటించారు.