03-08-2025 12:00:00 AM
ఓరుగల్లు బిడ్డ.. జానపదానికి అడ్డ
ఓరుగల్లు బిడ్డ కాసర్ల శ్యాం భాయ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనుల్లా. అల్లం కలిపిన చాయ్ తాగితే ఎంత కమ్మగుంటదో శ్యామన్న రాశిన పాట కూడా అట్లే ఉంటదని మస్తు మంది శెప్తరు. సైన్మలల్ల రాశే చాన్స్ అచ్చినప్పటి సంది పెన్ను పదును సూపెడ్తండు. అసొంటి శ్యాం భాయ్‌కి జాతీయ అవార్డు అచ్చుడు మనకు గర్వకారణం.
‘దివ్య’తోటి ఆటలా?
ఇయ్యాల, రేపు ఎక్కడ సూశినా ౨౦ ఏండ్లు కూడా నిండని దివ్యదేవ్‌ముఖ్ పేరే ఇనిపిస్తోంది. 2024 చెస్ ఒలింపియాడ్‌ల రెండు స్వర్ణ పతకాలు నెగ్గిన దివ్య.. తాజాగా చెస్ వరల్డ్‌కప్‌ను తన అకౌంట్లేసుకుంది. నాగ్‌పూర్‌లో పుట్టిన దివ్య సదువు కంటిన్యూ శేసుకుంటనే అందర్నీ ఆటాడిత్తంది. మహామహుల్ని తలదన్ని 19 ఏండ్ల శిన్నది దివ్య వరల్డ్‌కప్ గెలిశింది.